Header Banner

టెస్ట్ క్రికెట్కు గుడ్ బై.. ఈ కారణంగా త్వరలో.. క్లారిటీ ఇచ్చిన షమీ!

  Wed May 14, 2025 10:45        Sports

టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి బాటలోనే మహ్మద్ షమీ సైతం పయనిస్తున్నాడని గత కొద్ది గంటలుగా ప్రచారం జరుగుతోంది. రోహిత్, విరాట్ మాదిరిగానే షమీ కూడా టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనిపై షమీ ఘాటుగా స్పందించారు. ఓ ఇంగ్లీషు వెబ్‌సైట్‌లో తన రిటైర్మెంట్‌పై వచ్చిన వార్తను తీవ్రంగా ఖండిస్తూ.. దాన్ని రాసిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముందు నీ ఉద్యోగానికి వీడ్కోలు పలకడానికి రోజులు లెక్కపెట్టుకో.. తర్వాత నా రిటైర్మెంట్ గురించి మాట్లాడవచ్చు. నీలాంటి వాళ్లు మీడియాను సర్వనాశనం చేశారు.

 

ఇది కూడా చదవండి: భూ అంతర్భాగంలో 78 కిలోమీటర్ల లోతులో భారీ భూకంపం! 15 కిలోమీటర్ల దూరంలో..

 

ఆటగాళ్ల భవితవ్యం గురించి ఒక్కసారైనా మంచిగా చెప్పండి. ఈ రోజుకు ఇది చాలా చెత్త వార్త. సారీ అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నాడు. ఛాంపియన్ ట్రోఫీకి ముందు గాయం నుంచి కోలుకుని టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన షమీ మునుపటి జోరును కొనసాగించలేకపోతున్నారు. ఈ కారణంగా త్వరలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేయరనే ప్రచారం జరిగింది. ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన నేపథ్యంలో షమీ వ్యతిరేకులు తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇంగ్లండ్ పర్యటనకు అతన్ని ఎంపిక చేయవద్దంటూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 2023లో భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో షమీ టీమిండియాను ఒంటిచేత్తో ఫైనల్‌కు చేర్చాడు. ఆ మెగా టోర్నీలో షమీ ఏడు మ్యాచ్‌ల్లో ఏకంగా 24 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. తన కెరీర్‌లో 64 టెస్టులు, 108 వన్డేలు, 25 టీ20లు ఆడిన షమీ 462 వికెట్లు తీశాడు. 

 

ఇది కూడా చదవండి: 22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి మరో బిగ్ షాక్‌! కీలక నేత పార్టీకి రాజీనామా!

 

నమ్మి మోసపోయాను..! కొడాలి నానిపై వైసీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు!

 

ఏపీకి క్యూ కట్టనున్న కంపెనీలు.. ఎన్నో తెలుసా? నారా లోకేష్ కీలక ప్రకటన!

 

ఎలుకలన్నీ ఘోషించినా వేస్ట్.. పవన్ కల్యాణ్ ఓ ఆసక్తికర ట్వీట్ వైరల్!

 

జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడి అరెస్టు!

 

ఏపీ రాజకీయాల్లో విషాదం! గుండె పోటుతో కుప్పకూలిన మాజీ ఎంపీ!

 

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. సీట్లన్నీ ఏపీ వాళ్లకే.. ఉత్తర్వులు జారీ!

 

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia